తమన్నా లాక్‌డౌన్ డైరీ కవితాత్మకం

by  |
తమన్నా లాక్‌డౌన్ డైరీ కవితాత్మకం
X

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో త‌మ‌న్నా కూడా ఒకరు. మిల్కీ బ్యూటీగా యువ హృదయాలను దోచుకున్న తమన్నా.. తన డ్యాన్సింగ్, యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. అయితే తనలో మరో టాలెంట్ కూడా దాగుందన్న విషయాన్ని స్వయంగా తమన్నానే ఇటీవల బయటపెట్టింది. తనలో ఓ కవయిత్రి దాగుందన్న తమన్నా.. ‘లాక్‌డౌన్ వేళ కొన్ని కవితలు రాశానని.. ఇప్పుడు టైమ్ లేక రాయడం లేదుగానీ చిన్నప్పుడైతే కవితలు ఎక్కువగా రాసేదాన్నని’ చెబుతోంది.

కరోనా కారణంగా అందరికీ కావాల్సినంత టైమ్ దొరకడంతో.. సెలెబ్రిటీలు ఒక్కొక్కరు తమలోని టాలెంట్‌ను బయటికి తీస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే చేసింది. ‘మనసుకు హాయిగా అనిపించినప్పుడు తనలోని భావాలకు అక్షర రూపమిస్తానని’ అంటోంది. ‘ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో కొన్ని పోయెట్రీస్ రాశాను. వాటి కన్నా ఎక్కువగా నేను నా చిన్నతనంలో రాసుకున్న పాత కవితలను తిరిగి చదువుకున్నాను. వాటిని చదువుతుంటే.. అప్పుడు ఇలా రాశానని నవ్వొస్తుంది’ అని తమన్నా తెలిపారు.


Next Story

Most Viewed