- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీ చేరిన నడిగడ్డ తండా సమస్య.. ఆయనతో మాట్లాడుతా అన్న మంత్రి కిషన్ రెడ్డి
దిశ, మియాపూర్: మియాపూర్‌లోని నడిగడ్డ తండా వాసుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఢిల్లీలో సీఆర్పీఎఫ్, రెవెన్యూ, లాండ్ కస్టోడియన్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా.. గత యాభై సంవత్సరాల నుండే అక్కడ బంజారాలు, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు నివాసం ఉంటున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. మెట్రోరైలు ప్రాజెక్టు, హుడా వారు, అక్కడ భూకబ్జాలు చేసి భవనాలు కట్టుకున్నవారంతా కూడా వీరి తర్వాత వచ్చిన వారెనని వివరించారు. ఆ పేద ప్రజలపై దయవుంచి నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్లను మినహాయించి మిగతా భూమిని సీఆర్పీఎఫ్ వాళ్ళకు సర్వే చేసి ఇవ్వాలని కోరారు.
అలాగే సీఆర్పీఎఫ్ అధికారులను నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ లను వదిలి మిగిలిన ఖాళీ స్థలాన్ని తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ విషయమై అధికారులు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు పోగా ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకుంటానన్నారు. అవసరమైతే హోం మినిస్టర్ అమిత్ షాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన వారిలో జ్ఞానేంద్రప్రసాద్, నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, సీనియర్ నాయకులు ఇస్లావత్ దశరత్ నాయక్, ఏఐబీఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు ఉన్నారు.