- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూక్స్‌పై తల్లవాస్ విజయం
దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (cpl)లో మూడో మ్యాచ్ సెయింట్ లూసియా జూక్స్ (St. Lucia Zouks) , జమైకా తల్లవాస్ (Jamaica Tallavas) మధ్య జరిగింది. బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియం(Brian Lara Cricket Academy Stadium)లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తల్లవాస్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచిన తల్లవాస్.. జూక్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాప్ ఆర్డర్ (Top order) బ్యాటింగ్‌లో విఫలమైనా రోస్టర్ చేజ్ (52) వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 159 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన తల్లవాస్ జట్టు (Jamaica Tallavas) 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) (44), కెప్టెన్ పావెల్ (Captain Powell) (26) జట్టు ఇన్నింగ్స్ నిలబెట్టగా ఆసిఫ్ అలీ (Asif Ali) (47 నాటౌట్) ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో బ్రాత్‌వెయిట్ (Brathwaite) (18) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరానికి చేర్చాడు. తల్లవాస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అసిఫ్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు (Player of the Match Award) లభించింది.