- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ డెయిరీని విస్తరిస్తాం -తలసాని
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు.. నూతనంగా పెద్ద ఎత్తున ఔట్ లెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాదాపూర్‌లోని పశు వైద్యశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా.. విజయ డెయిరీ ఉత్పత్తులకు ప్రజలలో ఎంతో ఆదరణ ఉందని, కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని తలసాని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగరంలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం నూతనంగా ఔట్ లెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని స్పష్టం చేశారు. లాలాపేటలో ప్రస్తుతం ఉన్న డెయిరీని మెగా డెయిరీగా విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన మేడారం జాతరలో విజయ డెయిరీ కేంద్రాల ద్వారా సుమారు రూ. 18 లక్షలు, నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో రూ. 40 లక్షల రూపాయల విజయ ఉత్పత్తుల విక్రయాలు జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలసానితో పాటు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధార సిన్హా, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ MD శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.