- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దేశంలోని ఏ రాష్ట్రంలో… ఇలాంటి పథకం లేదు’
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణలో ఉన్న మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా సరళాసాగర్ లో 80 లక్షల చేపపిల్లలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…
దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదని, చెరువులు, కుంటల్లో ప్రభుత్వం విడిచిన చేపపిల్లలను కాపాడుకుని అమ్ముకోవడమే మత్య్సకారుల పని అని అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో పథకాలు ప్రవేశపెట్టారని, తన ప్రభుత్వంలో ఏ వర్గ ప్రజలు ఏ విధంగా ఉండాలో ఆయనే ముందు నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. అనుకున్న దాని ప్రకారమే అనేక పథకాలు ఆలోచించి ప్రవేశపెట్టారని తెలిపారు. కాగా మత్స్యకారులు చేపపిల్లల విడుదల సమయంలో నాణ్యత, లెక్కలు గమనించాలని సూచించారు.
అవసరమైన చోట చేపల మార్కెట్లను నిర్మిస్తామని, సరళాసాగర్‌లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాలో రెండు కోట్ల 53 లక్షల చేపపిల్లల విడుదల చేస్తున్నామని, చెరువులు నిండి, పంటలు పండి, చేపలతో కళకళలాడాలి అనేది సీఎం కేసీఆర్ కల అని అన్నారు. పేదల ఆకలి తెలిసిన నేత కేసీఆర్ అని కొనియాడారు.