రనౌత్ సెకండ్ లుక్‌కు రనౌటే!

by  |
రనౌత్ సెకండ్ లుక్‌కు రనౌటే!
X

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఐరన్‌లేడి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌పై అభిమానులు కాస్త నెగెటివ్‌గానే స్పందించారు. అసలు జయలలిత అమ్మకు, కంగనాకు పోలికలే లేవని విమర్శించారు. అయితే ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా కంగనా మరో లుక్‌ను షేర్ చేసింది మూవీ యూనిట్. అన్నాడీఎంకే బార్డర్‌తో ఉన్న తెల్లచీరను కట్టుకున్న కంగనా.. జయలలితను తలపిస్తోంది. ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకోలేకపోయిన కంగనా.. సెకండ్‌లుక్‌తో ప్రశంసలు అందుకుంటోంది. తలైవి ఫస్ట్‌లుక్‌తో విమర్శలు చవిచూసిన కంగనా… వాటిని పాజిటివ్‌గా తీసుకుని సెకండ్ లుక్ ఔట్‌పుట్ బాగా వచ్చేలా ట్రై చేసిందని.. డెడికేషన్ అంటే ఇదని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

స్టార్ హీరోయిన్ నుంచి పొలిటికల్ లీడర్‌గా ఎదిగిన జయలలిత జీవన ప్రయాణమే ‘తలైవి’ సినిమా కథ కాగా … ఎంజీఆర్‌గా మెప్పించాడు అరవింద స్వామి. ఇప్పటికే తన ఫస్ట్ లుక్‌తో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు. ప్రియమణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంలో.. శశికళ పాత్రకు నటి పూర్ణను ఎన్నుకున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

Read also..

సినిమాలో పాట లేదని పది వేలు ఫైన్


Next Story

Most Viewed