- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ జాగ్రత్తలు తీసుకోండి కరోనా రాకుండా సేఫ్‌గా ఉండండి: ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కో రాత్రి గడిచేసరికి కరోనా కేసులు రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, కర్నూలు, గుంటూరు వాసులు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా బారి నుంచి ఎలా రక్షణ పొందాలో చెబుతూ ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే…
నిత్యావసర వస్తువుల షాపులు లేదా మెడికల్ స్టోర్‌లలో పనిచేసే ఉద్యోగులు తమకు కరోనా వైరస్ లేదా ఫ్లూ లాంటి లక్షణాలున్నట్లు అనిపిస్తే విధులకు వెళ్లకూడదని చెప్పింది. కస్టమర్ల రద్దీని తగ్గించడానికి స్టోర్ లోపల వన్ వే లూప్‌ను సూచించేలా నేలపై గుర్తులు లేదా ఇతర దృశ్య వ్యవస్థను పాటించాలని సూచించింది. అలాగే వినియోగదారులు అవసరానికి మించి సరుకులు కొనకూడదని వారికి గుర్తుచేయాలని చెప్పింది.
వినియోగదారుల సంఖ్య పెరిగి క్యూలైన్ ఏర్పాటు చేయాల్సి వస్తే.. వారిని షాపు బయట ఒకే క్యూ లైన్‌లో దూరం దూరంగా నిల్చోబెట్టాలి. పెద్ద దుకాణదారులు తమ కస్టమర్ల ఫోన్ నంబర్లను తీసుకుని టోకెన్ పద్ధతిని పాటించాల్సి ఉంటుందని చెప్పింది. ఒక్కొక్క వినియోగదారుడికి ఫోన్ చేసి, ఖాళీ సమాయాల సమాచారమిస్తే.. రద్దీ తగ్గుతుందని సలహా ఇచ్చింది. అంతే కాకుండా పెద్ద దుకాణాలు ఆన్‌లైన్ షాపింగ్‌కి ప్రాధాన్యతనివ్వడంతో పాటు డోర్ డెలివరీ ఇస్తే మంచిదని సూచించింది.
స్టోర్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు, వినియోగదారులకు కూడా టెంపరేచర్ టెస్ట్‌లు విధిగా చేయాలని చెప్పింది. షాపులో వారికైనా లేదా వినియోగదారులకైనా 101 ఫారన్ హీట్ దాటి టెంపరేచర్ చూపిస్తే వారిని షాపులోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. షాపులో సిబ్బంది, కస్టమర్లు పరస్పరం తాకకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. బిల్లింగ్ సమయంలో కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చూసుకోవడం ద్వారా భౌతిక దూరం పాటించాలని సూచించింది. అలాగే షాపు సిబ్బంది విధిగా గ్లౌజులు, మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది.
ప్రస్తుత సమయంలో సాధ్యమైనంత వరకు నగదు చెల్లింపులను నివారించి ఆన్‌లైన్ ద్వారా లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పింది. షాపుల్లోని ప్రతి అంగుళాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. ఇలా చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచించింది. వ్యాధికి చికిత్స కంటే నియంత్రణే ముఖ్యమని గుర్తించాలని కమాండ్ కంట్రోల్
Tags: andhra pradesh, ap corona control central command, essentials, corona virus, covid-19, guidelines, corona eradication, precautions, Covid-19