మే 15 దాకా చారిత్రక ప్రదేశాల మూసివేత

by Shamantha N |
మే 15 దాకా చారిత్రక ప్రదేశాల మూసివేత
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎఎస్ఐ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలను మే 15 దాకా మూసేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన వెలువరించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ఈ ఉత్తర్వులను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తాజా నిర్ణయంతో ఢిల్లీలోని తాజ్ మహల్, కుతుబ్ మినార్, హుమయున్ టూంబ్ వంటివాటితో పాటు దేశంలో ఎఎస్ఐ పరిధి కింద ఉన్న 3,691 చారిత్రక ప్రదేశాలు మూతపడనున్నాయి. మే 15 తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎఎస్ఐ తెలిపింది.

దేశంలో తొలిదశ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చిలో చారిత్రక ప్రదేశాలను మూసివేసిన విషయం విదితమే. అయితే కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి డిసెంబర్ లో వాటిని పర్యాటకుల సందర్శనార్థం ఓపెన్ చేశారు. కానీ ఈ ఏడాది మార్చి నుంచి దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ విలయతాండవం సృష్టిస్తున్నాయి. గురువారం ఏకంగా 2 లక్షల కేసులు నమోదుకావడంతో ఎఎస్ఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed