తహసీల్దార్ సస్పెన్షన్.. రైతుల హర్షం

దిశ, ములుగు: తహసీల్దార్ అక్రమాల పై ఎన్నో సంఘటనలు వెలుగుచూస్తున్న వారి ప్రవర్తన మాత్రం మారడం లేదు. లంచం తీసుకొని పలు అక్రమ పట్టాలు.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనే సోమవారం ములుగు జిల్లాలో వెలుగుచూసింది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తహసీల్దార్ కిషోర్ కుమార్ ప్రభుత్వ భూముల్లో అక్రమ పట్టాలు జారీ చేశాడు. అర్హత కలిగిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా రూ. 30 వేల నుంచి 50 వేల వరకు లంచం తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. అతడికి నయాబ్ తహసీల్దార్ రాజు నాయక్, సునీల్ కుమార్, వీఆర్వోలు శంకర్, మల్లేష్, తిరుపతి, రాజులు అక్రమ పట్టాల కోసం సహకరించినట్లు తేలడంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్రమాలు చేసిన అధికారుల పై సస్పెన్షన్ వేశారు. దీంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి అవినీతి అధికారుల పై చర్యలు తీసుకున్నందుకు కలెక్టర్‌ను కొనియాడారు.

Advertisement