- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రెండింగ్‌లో ‘తారోన్ కే షెహర్’ సాంగ్
దిశ, వెబ్‌డెస్క్ : నటుడు సన్నీ కౌశల్, సింగర్ నేహా కక్కర్ కలిసి నటించిన వీడియో సాంగ్ ‘తారోన్ కే షెహర్’. ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సింగర్ నేహాకక్కర్ బాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో చాట్ బస్టర్స్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకోగా, సన్నీ కౌశల్.. ‘హర్దంగ్, షిద్దత్, బాంగ్రా పా లీ’ తదితర రొమాంటిక్ కామెడీ సినిమాల్లో నటించాడు. ఇక తొలిసారిగా మ్యూజిక్ వీడియోలో నటించిన సన్నీ.. చాలా ఫ్రెష్‌లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.
‘తారోన్ కే షెహర్’ పాటలో నేహా, సన్నీ జోడీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ఇందులో రాబర్స్‌గా కనిపించిన వీరిద్దరూ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేయగా.. ఫొటోగ్రఫీ దీనికి మరింత అందాన్ని తీసుకొచ్చింది. నేహా కక్కర్, జుబిన్ నౌతియాల్ ఆలపించిన పాటకు జానీ మ్యూజిక్ అందించడమే కాక లిరిక్స్ కూడా రాశారు. అర్విందర్ ఖైరా దర్శకత్వం వహించిన ఈ పాట 20 గంటల్లోనే.. 8.5 మిలియన్ వ్యూస్‌తో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. న్యూయార్క్ సిటీ నేపథ్యంలో సాగే ఈ పాట కోసం ఢిల్లీలోనే న్యూయార్క్ సిటీ సెట్ వేసి, కేవలం మూడు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇందులో నటించిన సన్నీ కౌశల్.. యూఆర్‌ఐ ఫేమ్ విక్కీ కౌశల్ బ్రదర్ కావడం విశేషం.