- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీ-ట్రైబ్ ద్వారా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
దిశ, వెబ్‌డెస్క్: ఔత్సాహిక స్టార్టప్‌లు, స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో విద్యా సంస్థలను భాగస్వాములుగా చేస్తూ ‘టీ-హబ్’ ప్రారంభించిన ‘టీ–ట్రైబ్’అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం అకడమిక్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్‌లోని 18 సంస్థలతో కలిసి 800కి పైగా విద్యార్థి పారిశ్రామికవేత్తలుగా మార్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా టీ-ట్రైబ్ విద్యార్థులు, ఎంటర్‌ప్రన్యూర్‌లు స్థాపించిన ఎనిమిది ఐడియా-స్టేజ్ స్టార్టప్‌ల ఇంక్యుబేషన్‌ను ప్రకటించింది. స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్ సమయంలో అవసరమైన వివిధ మౌలిక సదుపాయాల సౌకర్యాలతో పాటు గైడెన్స్, కీలక మద్దతును అందిస్తాయి.
టీ-ట్రైబ్ కోసం 80 మంది కంటే ఎక్కువ మంది పాల్గొన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యావేత్తలు, స్టూడెంట్ ఎంటర్‌ప్రన్యూర్స్, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు, పలు స్టార్టప్ కంపెనీల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘దేశ విదేశాల్లోని ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ‘టీ–ట్రైబ్’లో చేరిన విద్యాసంస్థలు, విద్యార్థులకు అవసరమైన సాధన సంపత్తిని ‘టీ–హబ్’అందజేసింది. కరోనా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యా సంస్థలు, విద్యార్థులను సరికొత్త ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ‘టీ–ట్రైబ్’లాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్డాయని’ చెప్పారు.