- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ-హబ్ కొత్త కార్యక్రమానికి స్టార్టప్‌లకు ఆహ్వానం
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ రెండో హబ్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ టీ-ఏంజెల్ కోసం స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్టు తెలిపింది. జులైలో ప్రారంభం కాబోయే 45 రోజుల కార్యక్రమానికి సుమారు 15-20 టెక్ స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. పెట్టుబడిదారులు, సలహాదారుల స్క్రీనింగ్ ప్రక్రియ తర్వాత ఆయా స్టార్టప్‌లను షార్ట్‌లిస్ చేయనున్నారు. దేశంలోని ఏ స్టార్టప్ అయినా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులకు జూన్ 30 చివరి తేదీగా టీ-హబ్ నిర్ణయించింది. అర్హత కలిగిన స్టార్టప్‌లకు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన అవరోధాలను అధిగమించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని టీ-హబ్ తెలిపింది. నిధుల సేకరణలో స్టార్టప్‌లు కొంతమేరకు మాత్రమే విజయవంతమవుతాయి. ఈ అంశం పట్ల వారికి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. టీ-ఏంజెల్ కార్యక్రమం అలాంటి సవాళ్లను పరిష్కరించేందుకు సహాయపడుతుందని టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ వెల్లడించారు.