- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ ఏదని అడిగితే కత్తితో పొడిచాడు
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా మహమ్మారి హత్యాయత్నాలకు కూడా కారణం అవుతోంది. వైరస్ సోకితేనే కాదు కట్టడికి చర్యలు తీసుకోవాలని చెప్పిన వారిని సైతం ఆసుపత్రి పాలు చేస్తోంది. కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి సెలూన్ షాపులో చోటుచోసుకున్న ఈ ఘటన వివారాలు ఇలా ఉన్నాయి.
గ్రామంలోని ఓ సెలూన్ షాపుకు కటింగ్ చేయించుకునేందుకు ఆసిఫ్ అనే వ్యక్తి వెళ్లాడు. అక్కడే ఉన్న ఇసుకమల్ల రాజశేఖర్ అనే వ్యక్తి మాస్క్ లేకుండా రావడం ఏంటని ఆసిఫ్ ను ప్రశ్నించాడు. మాస్క్ లేకుంటే నాకే ఇబ్బందని నీకేమవుతుందని ఎదురు ప్రశ్నించాడు ఆసిఫ్. కట్టడి కోసం చర్యలు తీసుకోకుంటే వ్యాధి మరింత తీవ్ర రూపం దాలుస్తుందని రాజశేఖర్ వివరించాడు.
ఇలా ఈ ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఆసిఫ్ బయటకు వెళ్లి వచ్చి రాజశేఖర్ పై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ సారథి, సీఐ తుల శ్రీనివాస రావులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. బాధితుడిని ఆస్పత్రకి తరలించారు. రాజశేకర్ వల్లంపహాడ్ నివాసిగా గుర్తించారు.