ఒలంపిక్స్ అర్హతకు మరో అవకాశం..

by Shiva |

దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్‌కు ఇప్పటి వరకు ఒక్క భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అర్హత సాధించలేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అర్హత సాధించడానికి సమయం పెంచారు. దీంతో ఒలంపిక్ బెర్త్ కోసం భారత స్టార్ షట్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సీజన్ తొలి టోర్నీ అయిన స్విస్ ఓపెన్ టోర్నమెంట్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, బి. సాయి ప్రణీత్‌లు బెర్తు కోసం పోటీ పడుతున్నారు. స్విస్ ఓపెన్‌లో భారత షెట్లర్లకు గతంలో మంచి రికార్డు ఉన్నది. గత సీజన్‌లో సాయి ప్రణీత్ రన్నరప్‌గా నిలిచాడు. అలాగే సమీర్, ప్రణయ్, శ్రీకాంత్ గతంలో ఇక్కడ టైటిల్స్ నెగ్గారు. 2019 వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన తర్వాత పీవీ సింధు మరో టైటిల్ నెగ్గలేదు. స్విస్ ఓపెన్ ద్వారా తిరిగి ఫామ్ సాధించాలని కోరుకుంటున్నది. ఈ టోర్నీ గెలుపోటముల ద్వారా ర్యాంకింగ్ పాయింట్లు లభించే అవకాశం ఉన్నది. ఒలంపిక్‌ అర్హత జూన్ 15 వరకు ఉండే ర్యాంకుల ద్వారా నిర్ణయిస్తారు.

షెడ్యూల్

మార్చి 2 – క్వాలిఫికేషన్స్, మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్
మార్చి 3 – రౌండ్ ఆఫ్ 32
మార్చి 4 – రౌండ్ ఆఫ్ 16
మార్చి 5 – క్వార్టర్ ఫైనల్స్
మార్చి 6 – సెమీఫైనల్స్
మార్చి 7 – ఫైనల్స్
అన్ని మ్యాచ్‌లు బీడబ్ల్యూఎఫ్ యూట్యూబ్ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి

Advertisement

Next Story

Most Viewed