- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి షాకింగ్ కామెంట్స్.. అది అన్యాయమని తెలియదు
దిశ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలు కొన్నిసార్లు అన్యాయాలు, అక్రమాలపై గొంతు వినిపిస్తూ ప్రజలకు మద్ధతుగా నిలుస్తుంటారు. ఈ క్రమంలో పౌరసమాజం నుంచి ప్రశంసలు పొందినా, కార్పొరేట్ శక్తులు మాత్రం కక్షగడతాయి. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్, సీఏఏ, ఎన్ఆర్‌సీ చట్టాల అమలుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను పలు కాంట్రాక్టుల నుంచి అన్యాయంగా తొలగించారని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.
‘నేను పోషించిన పాత్రల్లో తప్పులుంటే శిక్షించవచ్చు. కానీ నా అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడం కూడా నేరమని తెలియదు. అయినా నేను ఇతరులతో వాదించడంకన్నా నేరుగా ప్రజలతో నిరసనలో పాల్గొనడానికే మొగ్గు చూపుతాను. ఆ క్రమంలో నేను కూడా బాధితురాలిగానే ఫీల్ అవుతాను’ అని పేర్కొంది. తాను చేసిన పని వల్ల తమ ప్రొడక్ట్స్‌కు చెడ్డపేరు వస్తుందనే కారణంగా కొన్ని కమర్షియల్ బ్రాండ్స్ కాంట్రాక్ట్స్ రద్దు చేసుకున్నాయని చెప్పింది. ‘ఈ దేశంలో రాజ్యాంగ విలువలను నమ్మినందుకు నన్ను శిక్షించాలని అనుకుంటే, ఆ శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పడం విశేషం.
- Tags
- caa protests