సూపర్‌స్టార్‌కు స్వామీజీ బ్లెస్సింగ్స్

by Shyam |   ( Updated:4 Jan 2021 1:04 AM  )
సూపర్‌స్టార్‌కు స్వామీజీ బ్లెస్సింగ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్యతో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్.. కోలుకున్న తర్వాత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అభిమానులకు ఇది నిరాశే అయినా.. తలైవా ఆరోగ్యమే ప్రధానమని తలచి, ఆయన అభిప్రాయానికి మద్ధతుపలికినవాళ్లే ఎక్కువ. అదే సమయంలో పలు రాజకీయ పార్టీలు రజనీ మద్దతు కోసం తనను కలిసేందుకు ఆసక్తి చూపుతుండగా, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి భేటీలను ఆయన దాటవేస్తూ వస్తున్నాడు. అయితే.. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత రజనీ తొలిసారిగా ఆధ్యాత్మికవేత్త నమోనారాయణ స్వామీజీతో కనిపించారు. రజనీ ఇంటికి వెళ్లి, చాలా సేపు గడపడంతో పాటు ఆయన ఆరోగ్యం గురించి ఆరాతీసిన నమో నారాయణస్వామి.. రజనీ దంపతులకు ఆశీస్సులు అందించి వెళ్లారు. కాగా స్వామీజీ రజనీని కలిసివెళ్లిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి

Next Story