బీజేపీ, జేడీయూ మైత్రి బంధం తెగదు

by Shamantha N |
బీజేపీ, జేడీయూ మైత్రి బంధం తెగదు
X

పాట్నా: బిహార్ రాష్ట్రంలో బీజేపీ, జేడీయూ మధ్య మైత్రి బంధం బలమైందని, అది ఎప్పటికీ విడిపోదని ఆ పార్టీ నేత సుశీల్‌కుమార్ మోడీ పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంపై ఆయన వివరణ ఇస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

అరుణాచల్‌లో పార్టీ ఫిరాయింపు వ్యవహారం బిహార్‌లో బీజేపీ, జేడీయూ మైత్రి బంధంపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ వర్ధంతి పురస్కరించుకొని పాట్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విలేకరుల ప్రశ్నలకు పై విధంగా స్పందించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నితీశ్‌కుమార్ సీఎం కావాలనుకోలేదు. ఆయనే సీఎంగా ఉండాలని మేం కోరుకున్నాం. ఎన్నికలకు ముందు ఆయనే సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చాం. ప్రస్తుతం నితీశ్‌ కుమార్ ఎన్‌డీఏ సీఎం. మా అభ్యర్థనను మన్నించి ఆయన బాధ్యతలు స్వీకరించారు’ అని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. అరుణాచల్‌లో సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్టు పొడిచిందని జేడీయూ ఆరోపణల నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా సుశీల్ కుమార్ మోడీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story