ఇంటర్నెట్‌లో వైరల్ గా మారిన సుశీల్ ఘర్షణ ఫొటోలు

by Shyam |   ( Updated:2021-05-28 11:40:13.0  )
ఇంటర్నెట్‌లో వైరల్ గా మారిన సుశీల్ ఘర్షణ ఫొటోలు
X

దిశ, స్పోర్ట్స్ : యువ రెజ్లర్ సాగర్‌పై బేస్‌బాల్ బ్యాట్లు, హాకీ స్టిక్కులతో సుశీల్ కుమార్ దాడి చేస్తున్న వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను కొన్ని జాతీయ ఛానల్స్ ప్రసారం చేశారు. మే 4న చత్రాసాల్ స్టేడియంలో రాత్రి సమయంలో సుశీల్ కుమార్ అతడి అనుచరులు కలసి సాగర్‌పై దాడి చేస్తుండగా ఈ దృశ్యాలను ప్రిన్స్ తన మొబైల్‌లో చిత్రీకరించాడు. బేస్‌బాల్ బ్యాట్ చేతిలో పట్టుకొని ఉన్న సుశీల్ తీవ్ర ఆగ్రహంతో దాడి చేస్తూ కనిపించాడు. ఇన్ని రోజులు పోలీసుల వద్ద ఉన్న ఈ వీడియో ఒక్కసారిగా బయటకు రావడంతో సుశీల్ కుమార్‌ బండారం మొత్తం బయటపడినట్లు అయ్యింది.

చత్రాసాల్ స్టేడియంలో తన పెత్తనమే చెల్లాలని, అందరికీ తానంటే భయం ఉండాలని అందుకే ఈ వీడియోను తీయమంటూ స్నేహితుడు ప్రిన్స్‌ను సుశీల్ కోరాడు. దాడి అనంతరం రెజ్లింగ్ వర్గాలకు ఈ దృశ్యాలను పంపాలని భావించినా.. సాగర్ ఆసుపత్రిలో చనిపోవడంతో కథమొత్తం అడ్డం తిరిగింది. ఆ రోజు పారిపోయిన సుశీల్ దాదాపు 18 రోజుల తర్వాత పోలీసులకు దొరికాడు. ప్రస్తుతం పోలీసుల కష్టడీలో సుశీల్ ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed