సుశాంత్‌కు క్లాస్ట్రో ఫోబియా ఉందా?

by Jakkula Samataha |
సుశాంత్‌కు క్లాస్ట్రో ఫోబియా ఉందా?
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు థ్రిల్లర్ సినిమాను మించిన థ్రిల్లింగ్‌గా ఉంది. కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుండగా.. లేటెస్ట్‌గా డ్రగ్ యాంగిల్ కూడా బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా సీబీఐ, ఈడీతో కలిసి కేసును ఇన్వెస్టిగేట్ చేయనుంది. బ్యాన్ చేసిన డ్రగ్స్ వాడిన రియాతో పాటు తనకు సహకరించిన వారిపై ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీకి రియా చక్రవర్తి వాట్సాప్ చాట్‌లో డ్రగ్ డీలర్స్‌తో ఉన్న చాట్ దొరికింది.

దీంతో సుశాంత్‌ను డ్రగ్స్‌కు బానిసను చేసి హత్య చేసిన రియాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సుశాంత్ తండ్రి కేకే సింగ్, సోదరి శ్వేతా సింగ్. తన కుమారుడికి విషం ఇచ్చి చంపిన హంతకురాలు రియా అని.. దర్యాప్తు సంస్థలు వెంటనే తనను అదుపులోకి తీసుకోవాలని కోరారు కేకే సింగ్.

ఇదిలా ఉంటే, సుశాంత్‌కు క్లాస్ట్రో ఫోబియా( ఫ్లైట్ ఎక్కేందుకు భయం) ఉందని తెలిపింది రియా. అందుకే యూరోప్ ట్రిప్ వెళ్లేముందు ఇందుకు సంబంధించిన మెడిసిన్ తీసుకున్నాడని చెప్పింది. దీనిపై చాలా ఘాటుగా స్పందించింది అంకిత లోఖండె. సుశాంత్ ఫ్లైట్ నడిపేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్న వీడియోను షేర్ చేసిన ఆమె.. దీన్ని క్లాస్ట్రో ఫోబియా అంటారా? అని ప్రశ్నించింది. ఎప్పుడూ ఎగరాలి అని కలలు కనే వ్యక్తికి ఇలాంటి భయం ఉంటుందా? అని అడిగింది.

కాగా తనకు, తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని ముంబై పోలీసులను ఆశ్రయించింది రియా.

Advertisement

Next Story