- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీకి సుశాంత్ సోదరి విజ్ఞప్తి
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు రోజుకో కారణం వినిపిస్తోంది. రోజుకొకరు నిందితులుగా తెరమీదకి వస్తున్నారు. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో రియా పేరు తెరపైకి రాగా.. ఇప్పుడు తన సోదరి సుశాంత్ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరింది.
మీరు నిజం వైపు నిలబడతారని నా మనసు చెబుతోందన్న శ్వేతా సింగ్.. మేము చాలా సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళమని చెప్పింది. నా తమ్ముడు బాలీవుడ్లో ఎంటర్ అయినప్పుడు తనకు గాడ్ ఫాదర్ లేరని.. ఇప్పుడు కూడా మాకు ఎవరూ సపోర్టర్స్ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి మీరు త్వరగా ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. సాక్షాలు తారుమారు కాకుండా చూడాలని.. మాకు న్యాయం చేయాలని కోరింది సుశాంత్ సోదరి.
I am sister of Sushant Singh Rajput and I request an urgent scan of the whole case. We believe in India’s judicial system & expect justice at any cost. @narendramodi @PMOIndia #JusticeForSushant #SatyamevaJayate pic.twitter.com/dcDP6JQV8N
— shweta singh kirti (@shwetasinghkirt) August 1, 2020