సుశాంత్ కేసు: NCB చార్జ్‌షీట్‌.. రియాతో పాటు 33 మంది పేర్లు

by Shyam |
ria and sushanth
X

దిశ, సినిమా: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ముంబై స్పెషల్ కోర్టులో 33 మందితో కూడిన చార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఈ లిస్ట్‌లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు తన సోదరుడు ఉండగా..12 వేల పేజీలతో కూడిన డాక్యుమెంటరీ, 200 మంది సాక్షుల రికార్డెడ్ స్టేట్‌మెంట్స్ సబ్మిట్ చేసింది. గతేడాది జూన్ 14న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మరణించగా..ఎన్సీబీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ యాక్ట్ కింద గతంలో రియా, తన సోదరులు అరెస్ట్ కాగా బెయిల్ మీద విడుదలయ్యారు. 33 మంది నిందితుల్లో ఎనిమిది మంది ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Advertisement

Next Story