- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీ అలర్ట్: ఆకాశంలో అద్భుతం జరిగేది నేడే
దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ ఆకాశంలో అద్భుతం జరుగబోతోంది. 2021వ సంవత్సరం ప్రారంభమయ్యాక.. నేడు మొదటి సూర్యగ్రహణం జరుగబోతోంది. సూర్యుడు భూమికి మధ్యన చంద్రుడు రావడంతో సూర్య కిరణాలు చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడి నీడ భూమి పడడం వలన సూర్య గ్రహణ ఏర్పుడుతుంది. ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఆసియాలో ఎక్కువ భాగం పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ యొక్క ఈశాన్య ప్రాంతాలలో మాత్రమే కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 11:42 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది. మధ్యాహ్నం 3:30 నుండి గ్రహణ స్వరూపం పెరుగుతూ.. సాయంత్రం 4:52 గంటలకు ‘గోల్డెన్ రింగ్’ లాగా ఆకాశంలో కనిపిస్తుంది.
అయితే.. సూర్యగ్రహణంలో ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఖగోళ సంఘటనలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న చాలా మంది తమ కెమెరాతో సూర్యగ్రహణాన్ని బంధించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, అలా చేయొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు కళ్లను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని, ప్రత్యేక అద్దాలను ఉపయోగించి ఫోటోగ్రఫి చేయవచ్చు అని సూచించారు. కంటి చూపు తక్కువగా ఉన్నవారు ప్రత్యేక అద్దాలను వినియోగించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లలకు చూపించేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలని, వాహనాలు నడుపుతూ రోడ్లపై ఉంటేవాళ్లు హెడ్‌లైట్‌లతో డ్రైవ్ చేయాలని సూచించారు. అలా అయితే.. ఎలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం లేదన్నారు. ఇతర వాహనాలకు మధ్య దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.