- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గుండె ఫెయిలయ్యే దశలో 80 ఏళ్ల వృద్ధుడికి ప్రాణదానం
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గుండెలోని మూడు ధమనులలో ఒకటి మాత్రమే పనిచేస్తూ, గుండె పనితీరులో 30 శాతం మందగించి ఫెయిలయ్యే దశలో ఉన్న ఓ 80 ఏళ్ల వృద్ధుడికి అధునాతన, అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ ఆస్పత్రిడాక్టర్లు అతని ప్రాణాలు నిలిపారు. గుండె పనితీరు వేగంగా తగ్గుతూ అపస్మారక స్థితిలోకి వెళ్తున్న వృద్ధుడికి వెంటనే చికిత్సను ప్రారంభించి అధునాతన చికిత్సలో భాగంగా ముందుగా గుండెలో ఫేస్‌మేకర్‌ను అమర్చి ‘‘పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ’’ (పీటీసీఏ) చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే వృద్ధుడికి 1991లో ఒకసారి తీవ్రమైన గుండెపోటు రాగా దాని వల్ల అప్పుడు ఒక ధమని పూర్తిగా బ్లాక్ చేశారు.
ఇప్పుడు, రెండో ఎడమ ధమని హృదయ స్పందనను 30 శాతం తగ్గిపోవడంతో వృద్ధుడు తలతిరుగుతూ, స్పృహ కోల్పోతూ పడిపోయే పరిస్థితికి వచ్చాడు. దాంతో వెంటనే చికిత్సనందించక పోతే రక్త సరఫరా నిలిచిపోయి క్రమంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఈ దశలో డాక్టర్లు చికిత్సను ప్రారంభించి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వృద్ధుడికి అధునాతన చికిత్సనందించి, ప్రాణాలు కాపాడిన తీరును అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ గార్గ్, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ సుదర్శన్‌రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. వృద్దుడి పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నట్లు గమనించి వెంటనే అత్యవసర చికిత్సనందించేందుకు తాత్కాలిక పేస్‌మేకర్‌ను ఉపయోగించి హృదయ స్పందనను సాధారణ స్థితికి వచ్చేలా చూశామని చెప్పారు.
అయితే ఎవరికైనా గుండె కు సంబంధించిన ట్రీట్మెంట్ చేసేటప్పుడు వ్యక్తి రక్తహీనత సమస్య లేకుండా ముందుగానే చూసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా అంతర్గత భాగాల్లో ఎక్కడైనా రక్తస్రావం జరుగుతుందేమోనని చెక్ చేయాల్సి ఉంటుందన్నారు . అన్నీ పరిశీలించిన తర్వాతనే ఈ విధానంలో చికిత్సను తట్టుకుంటారన్న నిర్ధారణకు వచ్చి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు . దీనికి అన్ని విధాలుగా పేషెంట్ ఓకే కావడంతో ఈ అధునాతన పద్ధతులు, ట్రాన్స్‌ప్లాంటేషన్,ఉత్తమమైన మెడికేషన్స్ ఉపయోగించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగా వృద్ధుడు వేగంగా కోలుకున్నాడని తెలిపారు. “పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ (పీటీసీఏ) చికిత్సలో భాగంగా ఇంజక్షన్‌తో రెండు ధమనుల మధ్య ఎడమ ప్రధాన కరోనరి ధమని నుంచి మూడు భాగాలను కలిపి ఏర్పడే ఒక వైవిధ్యమైన కరోనరి ధమనిని రూపొందించి వృద్ధుడికి చికిత్సనందించామన్నారు.