సూర్య బర్త్‌డే కానుకగా స్పెషల్ సాంగ్!

by  |
సూర్య బర్త్‌డే కానుకగా స్పెషల్ సాంగ్!
X

హీరో సూర్య తమిళ్‌తో పాటు తెలుగులోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన సినిమా ఒకటి రిలీజ్ అయిందంటే.. అందులో ఎంతో కొంత స్పెషల్ ఉండాల్సిందే. ప్రతీ సినిమా కోసం తనను తాను మార్చుకుని, ఆ క్యారెక్టర్‌లో జీవించే సూర్య.. ఫాలోయింగ్, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాగా జులై 23న సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని.. తన లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అపర్ణ మురళి సూర్యతో జతకట్టగా.. ‘కాటుక కనులే’ అంటూ సాగే పాటలో వీరి మధ్య కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. దీక్షిత వెంకటేశన్ పాడిన ఈ పాటకు భాస్కరపట్ల సాహిత్యం అందించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని స్వయంగా సూర్యనే తన హోమ్ బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ పై తెరకెక్కిస్తున్నారు. ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో మోహన్ బాబు, పరేష్ రావల్, జాకీ ష్రాఫ్, సంపత్ రాజ్ కీలక
పాత్రల్లో కనిపించనున్నారు.



Next Story

Most Viewed