- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మే 24న రైనా జీవిత కథ విడుదల
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా జీవితం ఆధారంగా రాసిన ‘బిలీవ్ – వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్‌మీ’ పుస్తకం ఈ నెల 24న విడుదల కానున్నది. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ భరత్ సుందరేశన్‌తో కలసి సురేష్ రైనా ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ‘బిలీవ్.. క్రికెట్ కలలను నిజం చేసుకునేందుకు సాగించిన అంతర్గత ప్రయాణానికి.. బిలీవ్.. నీలో అత్యత్తమ గుణాలను ఆవిష్కరించేందుకు అవసరమైనది.. బిలీవ్.. సరిహద్దుల దాటే విశ్వాసం నీపై నీకు ఉంటే’ అంటూ క్యాప్షన్ పెట్టి సురేష్ రైనా ఈ పుస్తకం కవర్ పేజీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అమెజాన్‌లో ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ కూడా చేయవచ్చని రైనా పేర్కొన్నాడు. తాను క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు వరకు జరిగిన విశేషాలను ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తున్నది.