- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా జలాల వివాదం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాలపై సుప్రీంకోర్టు స్పందించింది. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే వెలువడిన ట్రిబ్యునల్ ఉత్తర్వులు, ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్‌లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను సోమవారం విచారించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో సహా నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాలకు సంబంధించిన వివరాలతో పాటు రాష్ట్రాల అభిప్రాయాలను మూడు పేజీలకు మించకుండా సుప్రీంకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు. డిసెంబరు 13వ తేదీ నుంచి వరుసగా విచారణ జరుగుతుందని, అప్పటికల్లా ఇవి అందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సైతం కృష్ణా జలాల వ్యవహారంలో ట్రిబ్యునల్ ఉత్తర్వులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వెలువరించిన గెజిట్‌కు సంబంధించిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. డిసెంబరు 13న విచారణ ప్రారంభం కానున్నందున దానికి 48 గంటల ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ అందాలని నొక్కిచెప్పారు.