ఫేస్‌బుక్, వాట్సప్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు

by Shamantha N |
supreme court
X

దిశ,వెబ్‌డెస్క్: వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. డేటాను ఇతర కంపెనీలతో వాట్సప్ పంచుకుంటోందని అందుకే వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తున్నట్టు పిటిషనర్ తెలిపారు. దీంతో ఫేస్‌బుక్, వాట్సప్ కంపెనీలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజల గోప్యతను పరిరక్షించాలని ఈ సందర్బంగా ధర్మాసనం అభిప్రాయ పడింది. ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ఫేస్‌బుక్, వాట్సప్ సంస్థలను సుప్రీం కోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా రెండు సంస్థలు ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story