మారటోరియంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

by  |
మారటోరియంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా ప్రవేశించాక కేంద్రం మార్చి నెల చివరలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అన్ని రంగాలు మూతపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించింది.

తాజాగా మారటోరియం అమలు విధానంపై సర్వోన్నత కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ప్రకటించిన విధానాలు, మారటోరియం అమలైన తీరుపై సుప్రీం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రుణాల మారటోరియంపై కేంద్రం తన వైఖరి చెప్పాలని.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)పేరు చెప్పి కేంద్రప్రభుత్వం తప్పించుకోరాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో ఆరు నెలలుగా మారటోరియం ఉన్నా వినియోగదారులపై భారం ఎందుకు పడుతోందని ప్రశ్నించింది.

తీసుకున్న రుణాలపై వడ్డీ, వడ్డీ పై వడ్డీ విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1లోగా తన వైఖరి చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందింస్తుందో వేచిచూడాలి.


Next Story