కేంద్రానికి భారీ షాక్.. ‘పెగాసస్’ పై చీఫ్ జస్టిస్ కీలక నిర్ణయం

by Shamantha N |
కేంద్రానికి భారీ షాక్.. ‘పెగాసస్’ పై చీఫ్ జస్టిస్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ (హ్యాకింగ్) అంశం ఎట్టకేలకు సుప్రీం కోర్టుకు చేరుకుంది. ఆగస్టు 5 నుంచి ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. పెగాసస్ దుమారంపై నమోదైన మూడు పిటిషన్ల పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. ద్విసభ్య ధర్మాసనంలో చీఫ్ జస్టిస్‌తో పాటు జస్టిస్ సూర్యకాంత్‌ ఉన్నారు. ఇజ్రాయిల్ ఎన్‌ఎస్‌వో నుంచి కేంద్రం కొనుగోలు చేసిన పెగాసస్ స్పైవేర్‌ సాయంతో దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు, కీలక ప్రతిపక్ష నాయకుల ఫోన్లు హ్యాకింగ్ జరిగాయని ‘ది వైర్’ కథనం పేర్కొనడంతో ఒక్కసారిగా పెనుదుమారం రేగింది.

దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. కేంద్రానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆందోళనలు చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతూనే వచ్చాయి. ఫలితంగా రూ.130 కోట్లకు పైగా విలువైన ప్రజాధనం వృథా అయ్యిందని తాజాగా కేంద్రం ప్రకటించింది. కాగా, ప్రతిపక్ష పార్టీల డిమాండ్ మేరకు సుప్రీం పెగాసస్ అంశాన్ని విచారణకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed