సూపర్‌స్టార్ మహేశ్ మెచ్చిన సినిమా

by Shyam |
సూపర్‌స్టార్ మహేశ్ మెచ్చిన సినిమా
X

తమిళంలో.. అశోక్‌ సెల్వన్‌, రితికా సింగ్‌, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన రొమాంటిక్‌ చిత్రం ‘ఓ మై కడవులే’. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ చిత్రానికి యూత్‌ నుంచి మంచి స్పందన లభించింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. చిత్ర యూనిట్‌ను ట్విటర్‌ వేదిక‌గా అభినందించారు. డైరెక్టర్‌ అశ్వథ్‌ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని ప్రశంసించారు.

ఇక కథ విషయానికొస్తే.. ఒక యువ‌కుడు అనుకోని ప‌రిస్థితుల్లో త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడు. మాన‌సికంగా కొన్ని ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న ఆ యువ‌కుడికి దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై మ‌ళ్లీ జీవితంలో మ‌రో అవ‌కాశం ఇస్తే ఏమ‌వుతుంది? అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మే ‘ఓ మై క‌డ‌వులే’. కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్(జీ5)లో విడుదలైన ఈ చిత్రం మంచి యూత్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేశ్.. ‘చిత్రంలోని ప్రతి బిట్‌ను ఎంజాయ్ చేశాను. దర్శకుడు అశ్వత్ కథను చాలా బాగా రాశాడు. దర్శకత్వంలోనూ తన ప్రతిభ చూపాడు. నటీనటుల యాక్టింగ్ బ్రిలియంట్. హీరో అశోక్ చాలా నేచురల్‌గా చేశాడు’ అని ట్వీట్ చేశాడు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభినంద‌న‌లు అందుకున్న డైరెక్టర్‌ అశ్వథ్‌ స‌హా మొత్తం చిత్ర యూనిట్ మ‌హేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

అంతేకాదు ఈ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కూడా కీల‌క పాత్ర‌లో నటించి మెప్పించాడు. కాగా, ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో పాటు రీమేక్ చిత్రాల‌ను కూడా అందిస్తోన్న పీవీపీ సినిమా.. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. ఇక మంచి దర్శకుడిగానే కాకుండా వెర్సటైల్ రైటర్‌గానూ పెరు తెచ్చుకున్న పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్‌ను.. ఈ చిత్రానికి సంభాషణలు అందించడానికి అప్రోచ్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు వచ్చే ఏడాది సీక్వెల్ నిర్మిస్తున్నట్లు కూడా దర్శకుడు అశ్వత్ తెలిపారు.

https://twitter.com/urstrulyMahesh/status/1284547359473467392

Advertisement

Next Story