హైదరాబాద్ టార్గెట్ @132

by Anukaran |
హైదరాబాద్ టార్గెట్ @132
X

దిశ, వెబ్‌డెస్క్: కీలక క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్‌మెన్స్ పేలవ ప్రదర్శన కనబరిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ(6), ఫడిక్కల్‌(1) వెనుదిరిగారు. దీంతో బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో వెళ్లింది. అనంతరం వచ్చిన ఆరోన్ ఫించ్(32), ఏబీ డివిల్లియర్స్(56), దూబే(8), వాషింగ్టన్ సుందర్(5) పెవీలియన్ బాటపట్టారు. చివరగా నవదీప్ శైనీ(09), మహమ్మద్ సిరాజ్(10)తో జతకలిసి జట్టు టోటల్ స్కోరును 131కు చేర్చారు. ఈ క్రమంలో ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుట 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ మ్యాచ్‌లో హోల్డర్ మూడు వికెట్లు, నటరాజన్ రెండు వికెట్లు, నదీమ్ ఒక వికెట్ తీసుకున్నారు. మరి ఈ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ చేధిస్తుందో లేదో వేచి చూడాలి.



Next Story

Most Viewed