- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నీ స్టార్ట్ చేసింది..
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ 2019లో వచ్చిన ‘మోతిచూర్ చక్నాచూర్’ అనే సినిమా తర్వాత ఇంతవరకు మరో చిత్రాన్ని ప్రకటించలేదు. కరోనా టైమ్‌లో ఫ్యామిలీతో పాటు పూర్తిగా లాస్‌ఏంజెల్స్‌లో గడిపిన సన్నీ.. విక్రమ్ భట్ దర్శకత్వంలో ‘అనామిక’ ప్రాజెక్ట్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. పది ఎపిసోడ్స్‌తో తెరెకెక్కుతున్న ‘అనామిక’ పూర్తిగా గన్‌ఫూ (గన్ అండ్ కుంగ్‌ఫూ) యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు విక్రమ్ భట్ తెలిపాడు.
‘నా లాక్‌డౌన్ ముగిసింది. ఓ కొత్త జర్నీని సూపర్ డైరెక్టర్ విక్రమ్ భట్‌తో ప్రారంభించబోతున్నాను’ అని సన్నీలియోన్ తన ఇన్‌స్టా వేదికగా పేర్కొంది. ఇందులో సన్నీ చాలెంజింగ్ రోల్ ప్లే చేస్తుండగా, ఎప్పుడూ చేయని యాక్షన్ సీక్వెన్స్‌తో ఆడియన్స్‌కు థ్రిల్ అందించనుంది. నవంబర్‌లో సన్నీలియోన్ లాస్ ఏంజెల్స్ నుంచి ఇండియాకు తిరిగి రాగా, ఆ తర్వాత ఓ మ్యూజిక్ వీడియో షూట్‌లో పాల్గొంది. దాంతో పాటు ఆమె ఇటీవలే పెటా ఇండియా డైరెక్టర్ ఆఫ్ సెలెబ్రిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సచిన్ బంగేరాతో కలిసి ‘వెగాన్ ఫ్యాషన్స్’, ‘క్రూయెల్టీ ఫ్రీ కాస్మెటిక్స్’ అంశాలపై ఇన్‌స్టా లైవ్ చాట్ చేసింది. కాగా ‘అనామిక’ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో విడులవుతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.