- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు
by Shamantha N |
X
లక్నో: అయోధ్యలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు ప్రక్రియ మొదలైందని యూపీ సున్ని వక్ఫ్ బోర్డు ప్రకటించింది. వక్ఫ్ బోర్డు అధ్యక్షులు జుఫర్ అహ్మద్ ఫరూఖీ ఈ ట్రస్టుకు చీఫ్ ట్రస్టీగా ఉండనున్నారు. ఫరూఖీ మాట్లాడుతూ, తాము ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.
అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో కేటాయించిన ఐదు ఎకరాలలో మసీదు, ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ, హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ఈ ట్రస్టులో 15 మంది సభ్యులుంటారని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గతేడాది అనుమతినిస్తూ మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ప్రసిద్ధ స్థలంలో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story