అందరికీ ఘనమైన వీడ్కోలు సాధ్యం కాదు :గవాస్కర్

by Shyam |
gavaskar
X

దిశ, స్పోర్ట్స్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి కప్ కొట్టకుండానే వెనుదిరిగింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా చివరి సీజన్ కావడంతో ఆ జట్టుపై భారీ అంచనాలు పెరిగాయి.అందుకు తగ్గట్లుగానే ఆడినా ఎలిమినేటర్‌లో పరాజయం పాలైంది. దీనిపై కోహ్లీ అండ్ టీమ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సునిల్ గవాస్కర్ ఓదార్పునిచ్చే మాటలు చెప్పారు. ఏ ఆటలో అయినా ప్రతీ ఒక్కరు ఒక ఘనమైన వీడ్కోలును కోరుకుంటారు.. కానీ మనం అనుకున్నవి అన్నీ జరగవు అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

‘అందరు ఆటగాళ్ల లాగే కోహ్లీ కూడా ఘనమైన ముగింపు ఇవ్వాలని కోరుకొని ఉంటాడు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు. బ్రాడ్‌మాన్ లాంటి దిగ్గజం కెరీర్‌లో 100 సగటు సాధించడానికి చివరి మ్యాచ్‌లో 4 పరుగులు అవసరం అయ్యాయి. కానీ అందులో అతడు డకౌట్ అయ్యాడు. సచిన్ తను ఆడిన 200వ టెస్టులో సెంచరీ చేయాలని భావించి ఉంటాడు. కానీ అతడు 79 పరుగులకే అవుటయ్యాడు. జీవితంలో మనం ఊహించినట్లు జరగదు. అందరికీ ఘనమైన వీడ్కోలు సాధ్యం కాదు. కోహ్లీ జట్టు కోసం చాలా పాటుపడ్డాడు. ఆర్సీబీ జట్టుకు ఒక ప్రత్యేకతను తీసుకొని వచ్చింది కోహ్లీనే. ఇది ఎవరూ కాదనలేని విషయం’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed