జగన్‌ను ఎద్దేవా చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి

by srinivas |
జగన్‌ను ఎద్దేవా చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి
X

బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ను ట్విట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా ఎద్దేవా చేశారు. ఆయన తన ట్విట్టర్‌లో ప్రపంచం మొత్తం కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కరోనా వస్తుంది, పోతుంది అన్నారని విమర్శించారు. అలాగే కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పారాసిటమాల్ మాత్రను వాడమంటున్నారంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌కు సిఫారసు చేశారు. ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యల నుంచి ఆంధప్రదేశ్ ప్రజలను కాపాడండి అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ట్వీట్‌తో పాటు ఏఎన్ఐ సంస్థ ప్రచురించిన వార్తను కూడా జోడించారు. అందులో కరోనాకు పారాసిటమాల్ చక్కని ఔషధం అని జగన్ చెప్పినట్టు ఉంది. కాగా, కరోనాకు పారాసిటమాల్ మాత్ర ఔషధమంటూ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed