హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్.. మీడియాపై ఆగ్రహం

by Jakkula Samataha |
sunil-shetti
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి బిల్డింగ్‌ను బీఎంసీ అధికారులు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. డెల్టా కేసులు నమోదు కావడం వల్లే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియాలో ప్రచారం కాగా సోషల్ మీడియాలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ, స్టాఫ్‌తో సహా బిల్డింగ్‌‌లో ఉన్న అందరూ సేఫ్‌‌గా ఉన్నారన్న శెట్టి.. వైరస్‌ కన్నా వేగంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడం విచారకరమన్నారు. ప్రజలను అనవసరంగా భయపెట్టకూడదని, తమ బిల్డింగ్‌లో డెల్టా వేరియంట్ అనేది లేదని స్పష్టం చేశాడు. ఈ మధ్య ఒకరికి మాత్రం కొవిడ్ పాజిటివ్ వచ్చిందని చికిత్స తర్వాత తనకు కూడా నెగెటివ్ వచ్చిందని తెలిపాడు.

Next Story

Most Viewed