వీకెండ్ కలెక్షన్స్‌లా.. కరెంట్ బిల్ : సందీప్ కిషన్

by  |
వీకెండ్ కలెక్షన్స్‌లా.. కరెంట్ బిల్ : సందీప్ కిషన్
X

కరెంట్ బిల్ పట్ట పగలే చుక్కలు చూపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి ఖంగు తింటున్నారు. ఈ మధ్య తాప్సీ, కార్తీక, స్నేహతో పాటు చాలా మంది సెలబ్రిటీలు కరెంట్ బిల్ చూసి షాక్ తిన్నామని సోషల్ మీడియా వేదికగా తమ బిల్ డీటెయిల్స్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కరెంట్ బిల్‌తో షాక్ కొట్టిన లిస్ట్‌లో హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయారు.

https://twitter.com/sundeepkishan/status/1277834372268216320?s=19

తన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డ్ మీటర్ చిన్ననాటి ఆటో రిక్షాను గుర్తుచేస్తోందన్నారు సందీప్. ‘అది కూడా అంతే.. ఎప్పుడు ఎంత చార్జ్ పడుతుందో చెప్పలేక పోయేవాళ్ళం. ఇప్పుడు కూడా అంతే .. ఏంది సార్ ఈ కరెంట్ బిల్?’ అని ప్రశ్నించాడు. నెక్స్ట్ ఎవరింటికి ఎంత బిల్ వచ్చిందని ఆన్‌లైన్‌లో వార్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. ఎలక్ట్రిసిటీ బిల్లు కొత్తగా రిలీజైన సినిమా వీకెండ్ కలెక్షన్లను తలపిస్తోందంటూ కామెంట్ చేశాడు.


Next Story

Most Viewed