అమ్మాయి కోసం వెయిటింగ్ : సందీప్ కిషన్

by  |
అమ్మాయి కోసం వెయిటింగ్ : సందీప్ కిషన్
X

దిశ, వెబ్ డెస్క్: ‘A1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపించబోతున్న సందీప్ కిషన్.. న్యూ లుక్‌తో అదరగొట్టేశాడు. పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గి, సిక్స్ ప్యాక్ బిల్డ్ చేసిన సందీప్.. ప్రేమ, పెళ్లి గురించి కూడా ఆలోచిస్తున్నాడు. దాదాపు మూడేళ్ళ క్రితం ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్న తను.. ఇప్పుడు సింగిల్‌గానే ఉన్నట్లు తెలిపాడు. కావాలనే తన పేరు రహస్యంగా ఉంచానని.. తన వల్ల అమ్మాయికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అలా చేసినట్లు చెప్పాడు.

లాక్‌డౌన్‌లో ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారని.. తను కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్లు చెప్పాడు. కానీ పెళ్లి గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని.. ఫ్రెండ్స్ మాత్రం దీని గురించి అడుగుతున్నారని చెప్పాడు. మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నానని.. తనను భరించే అమ్మాయి అయితే ఇంకా మంచిదని చెప్పాడు.

వెంకటాద్రి టాకీస్ స్థాపించి నిర్మాతగా కూడా మారిపోయిన సందీప్ కిషన్.. ఫ్యూచర్‌పై పూర్తి క్లారిటీతో ఉన్నాడు. ‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీలో నటిస్తూ నిర్మిస్తున్న తను.. ‘వివాహ భోజనంబు’ సినిమా ద్వారా కమెడియన్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు.


Next Story