సన్‌ఫార్మా తొలి త్రైమాసిక నష్టం రూ. 1655 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో రూ. 1,655.60 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 1,387.48 కోట్ల లాభాలను నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 7,467.19 కోట్లని, ఇది గతేడాది త్రైమాసికంలో రూ. 8,259.30 కోట్లుగా ఉంది. వడ్డీ, పన్ను, తరుగుదలకు ముందు కంపెనీ ఆదాయం 7.6 శాతం తగ్గి రూ. 1,843.6 కోట్లకు చేరుకున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ‘కొవిడ్-19 ప్రభావాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. వినియోగదారులు, సరఫరా వ్యవస్థ, ఉద్యోగులు, లాజిస్టిక్‌లపై కరోనా ప్రభావం ఏ మేరకు ఉందో ఎప్పటికప్పుడు కంపెనీ పరిశీలిస్తున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Advertisement