- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఎం సహాయనిధికి భారీ విరాళం ఇచ్చిన సన్ నెట్వర్క్
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ తమిళనాడులో కరాళనృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కరోనా నుండి రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశంలోనే ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ దిగ్గజం సన్ నెట్వర్క్ రూ. 10 కోట్ల విరాళం సీఎం సహాయనిధికి ఇచ్చింది. సన్ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్ ఆయన సతీమణి కావేరి లు సోమవారం స్టాలిన్ దంపతులను కలిసి విరాళంను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ వారికి అభినందనలు తెలిపారు.
Next Story