రాజోలులో ఆక్సిజన్ ప్లాంట్.. దర్శకుడు సుకుమార్

by Jakkula Samataha |
రాజోలులో ఆక్సిజన్ ప్లాంట్.. దర్శకుడు సుకుమార్
X

దిశ, సినిమా : కరోనా సమయంలో సొంత గ్రామాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు దర్శకుడు సుకుమార్. ఆక్సిజన్ దొరకక పడుతున్న అవస్థలు గమనించిన ఆయన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో ఉన్న రాజోలులో రూ. 40 లక్షలతో డీఓసీఎస్‌ 80 ఆక్సిజన్‌ జనరేటర్‌ సిస్టమ్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు.

నాలుగు రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా రూ. 25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్న సుకుమార్… మరో రూ.15లక్షలు కలిపి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని సుకుమార్ ఫ్రెండ్ అమలాపురం పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు తెలపగా.. ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రజలు అభినందిస్తున్నారు.



Next Story

Most Viewed