కంగారొద్దు.. నేనేదైనా చెప్పే చేస్తా: సుజనా చౌదరి

by srinivas |
కంగారొద్దు.. నేనేదైనా చెప్పే చేస్తా: సుజనా చౌదరి
X

దిశ ఏపీ బ్యూరో: హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్‌లో ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో కలవడంపై బీజేపీ నేత సుజనా చౌదరి మరోసారి స్పందించారు. ఈ సారి వైఎస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన ప్రశ్నలనే ట్విట్టర్ మాధ్యమంగా సంధించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ‘నిమ్మగడ్డ రమేశ్ కుమార్, కామినేని శ్రీనివాస్ పార్క్ హయత్‎లోని నా కార్యాలయానికి వచ్చినందుకే నానా హైరానా పడుతున్నారు. మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి? కంగారొద్దు.. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి.. నేనేదైనా చెప్పే చేస్తా’ అని అన్నారు.

ఇంకా ‘రమేశ్ కుమార్‌ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉండి ఎంపీని కలవడంలో మతలబేంటని మీ సాక్షి మీడియా ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఆయనను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు.


Advertisement
Next Story

Most Viewed