తండ్రి పేదరికం గుర్తురాలేదా.. మరీ ఇంత పెద్ద శిక్ష విధించిలా..!

by Sumithra |
తండ్రి పేదరికం గుర్తురాలేదా.. మరీ ఇంత పెద్ద శిక్ష విధించిలా..!
X

దిశ, కామారెడ్డి: మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి తండ్రి డబ్బులు ఇవ్వడం లేదని కలత చెందిన ఓ 17 సంవత్సరాల మైనర్ కుర్రాడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్నోద్దీన్(17) గత కొద్దిరోజులుగా తండ్రి ఖాసీమోద్దీన్‌ను మొబైల్ ఫోన్ కోసం డబ్బులు కావాలని అడుగుతున్నాడు. గత మూడు నెలల క్రితం డబ్బులు ఇవ్వలేదని, ఇంట్లో నుంచి 10 రోజుల పాటు వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా తండ్రిని డబ్బుల కోసం అడగగా ఇవ్వలేదు. దీంతో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ప్రతి రోజు రోడ్లపై బట్టలు విక్రయించుకుంటూ జీవనం సాగించే ఆ కుటుంబంలో చేతికందిన కొడుకు మృతి చెందాడని, ప్రభుత్వం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని పలువురు కోరారు.

Advertisement

Next Story