చెప్పుతో కొట్టాడని ఆత్మహత్య..!

దిశ, స్టేషన్ ఘనపూర్: సర్పంచ్ చెప్పుతో‌ కొట్టాడని అవమాన భారంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా రఘనాధపల్లి మండలంలో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. కుసుంబాయి తండాకు చెందిన గూగులోత్ ఎల్లేష్ (26) వీధిలైట్ల విషయంలో ఆదివారం రాత్రి సర్పంచ్ దరావత్ రమేష్‎తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సర్పంచ్ ఎల్లేష్‎ను చెప్పుతో కొట్టాడు. దీంతో అవమానం భరించలేని ఎల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎల్లేష్ మృతదేహంతో మృతుడి బంధువులు, తండావాసులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తండావాసులు డిమాండ్ చేశారు.

Advertisement