‘గుర్తుందా శీతాకాలం’లో సుహాసిని కథేంటి?

by Jakkula Samataha |
suhasini
X

దిశ, సినిమా : సత్యదేవ్, తమన్నా భాటియా, మేఘా ఆకాష్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగ శేఖర్ దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా.. కొత్తగా సీనియర్ నటి సుహాసిని టీమ్‌తో జాయిన్ అయ్యారు. కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్‌టెయిల్’కు రీమేక్‌గా వస్తున్న సినిమాలో సుహాసిని సత్యదేవ్ తల్లిగా కనిపించనుందని సమాచారం. వాలెంటైన్స్ డే కానుకగా రిలీజైన సినిమా ఫస్ట్ లుక్‌‌కు బెస్ట్ రెస్పాన్స్ లభించగా.. తాజాగా సుహాసిని సెట్స్‌లో జాయిన్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. కాగా త్వరలోనే మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తామన్నారు మేకర్స్. కాగా సుహాసిని.. సత్యదేవ్, తమన్నా చేతులను పట్టుకుని ఉన్న పిక్చర్ పోస్ట్ చేసిన హీరో తనతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed