సుధీర్ బాబు మెడలో ‘మెడల్’

by Shyam |
సుధీర్ బాబు మెడలో ‘మెడల్’
X

రొటీన్ సినిమాలకు, మూస కథలకు భిన్నంగా సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో.. సుధీర్ బాబు ఒకరు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్, టాలెంటెడ్ హీరో.. బాలీవుడ్‌లోనూ ‘భాఘీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ విషయం పక్కన పెడితే.. సుధీర్ బాబు ఒకప్పుడు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. స్కూల్ డేస్‌లో బ్యాడ్మింటన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. నేషనల్ స్కూల్ గేమ్స్‌లో రన్నరప్ గా నిలిచి.. మెడల్ అందుకున్నాడు. కాగా మెడల్ అందుకున్నప్పటి అరుదైన త్రోబ్యాక్ స్టిల్‌ను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు సుధీర్. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు ఆంధ్రప్రదేశ్‌లో బ్యాడ్మింటన్‌లో నంబర్ వన్ ర్యాంకు సాధించాడు.

కాగా, ఒకప్పటి బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి డబుల్స్ పార్ట్‌నర్‌గా ఆడిన సుధీర్ బాబు.. ప్రస్తుతం గోపిచంద్ బయోపిక్‌ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయేందుకు చాలా రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్నాడు. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

Next Story