- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ అనుభవం.. మళ్లీ మళ్లీ కావాలి : సుధీర్ బాబు
దిశ, వెబ్‌డెస్క్: హీరో సుధీర్ బాబు ‘వి’ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్నారు. స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా అదిరిపోయే యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసిన సుధీర్ బాబు.. తన డ్యాన్స్‌తోనూ ప్రేక్షకులను ఫిదా చేశారు. సూపర్ స్టైల్, స్వాగ్‌తో ‘ది బెస్ట్’ అనిపించుకున్న హీరో.. ఈ చిత్రం వల్ల తనకు మరిచిపోలేని గొప్ప అనుభవం ఎదురైందని తెలిపాడు.
అమ్మా నాన్న.. ‘వి’ సినిమా గురించి చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. మూవీ రెస్పాన్స్ గురించి ఫ్రెండ్స్ ద్వారా విన్న ఇద్దరి మొహాల్లో ఇంతకుముందెన్నడూ లేని ఆనందం కనిపిస్తుందన్నారు. అమెజాన్‌లో సినిమా ప్రసారం అయినప్పటి నుంచి అమ్మ మొబైల్ కాల్స్, మెసేజ్‌లతో నిండి పోయిందని తెలిపాడు. నాన్నకు తనకు మధ్య సినిమాల గురించి చర్చ జరగలేదని, అసలు నాన్న ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు. కానీ ‘వి’ సినిమా చూశాక అందులో నా నటన గురించి మాట్లాడారని.. ఇదొక అరుదైన అనుభవమని.. నా కళ్లలో ఆనంద భాష్పాలు వచ్చాయని చెప్పాడు. ‘ఇప్పటి వరకు నేనేదో సాధించాననే భావన నాలో ఎప్పుడూ కలగలేదని.. కానీ అమ్మానాన్న కళ్లలో ఆ గర్వం చూశాక ఇప్పుడు అలా అనిపించిందని’ తెలిపారు సుధీర్ బాబు. ఇలాంటి అనుభవం మళ్లీ మళ్లీ ఎదురుకావాలని.. నేను ఆనందంతో లోలోపల ఏడవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Read Also…