‘వి’జయానందంలో సుధీర్ బాబు

by  |
‘వి’జయానందంలో సుధీర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: నాని 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించారు. ‘వి’ చిత్రం శనివారం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన సుధీర్ బాబు.. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘వి’ చిత్రానికి ఇండస్ట్రీ పెద్దలతో పాటు అభిమానుల నుంచి మంచి టాక్ రావడంతో.. సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. షాంపియన్ బాటిల్‌ను పొంగిస్తూ.. తన ఆనందాన్ని తెలియజేశాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి వేడుకలు జరుపుకుంటుండగా తీసిన వీడియో, ఫొటోలను షేర్ చేశాడు. అంతేకాదు తన అభిమానులతో ఈ ఆనందాన్ని పంచుకునేందుకు ట్విట్టర్‌లోనూ ‘వి విత్ సుధీర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతపరిచాడు. ఏడు గంటలకు అభిమానుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపాడు.

థియేటర్‌లో మాస్ సన్నివేశాలకు ప్రేక్షకుల గోల మామూలుగా ఉండదు. అలాంటివి ఇటు సినీ తారలు, అటు అభిమానులు మిస్ అవుతున్నారు. అయితే.. ‘వి’ చిత్రానికి అవి కూడా తోడయ్యాయి. ఈ చిత్రంలో సుధీర్ బాబు మాస్ ఎంట్రీకి ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించి, టీవీ ముందు హారతి ఇచ్చాడు. ఆ అభిమాని సదరు ఫొటోను సుధీర్ బాబుకు ట్వీట్ చేయగా.. ఇది చేయడం కరెక్ట్ కాదని, మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా అనేక మార్గాలున్నాయని సుధీర్ ఆ అభిమానికి సూచించడం గమనార్హం.



Next Story