- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై కేసీఆర్ ఉదాసీనత : పొంగులేటి
దిశ, ఖమ్మం: తెలంగాణలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోందని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసులు 40 వేలకు చేరువలో ఉన్నా, ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం బేషజాలకు పోకుండా రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంకు ఉన్న అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఢిల్లీలో కరోనా కట్దడిలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని అమిత్ షా రంగంలోకి దిగి నియంత్రణలోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో కరోనా కేసులు మిలియన్‌కు చేరుకున్నాయని మోదీ ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు ,ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా టెస్టులు పెంచడంతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలని సూచించారు.