టాలీవుడ్ హీరోతో సినిమా.. సుధా కొంగర ప్లాన్?

by Shyam |
sudha kongara
X

దిశ, సినిమా: మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘సాలా ఖడూస్’ చిత్రం ద్వారా సుధా కొంగర దర్శకురాలిగా సత్తా చాటింది. అదే చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేశ్‌తో ‘గురు’గా రీమేక్ చేసి ఇక్కడా సక్సెస్ అందుకుంది. మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన సుధ, మొదట కృష్ణ భగవాన్ హీరోగా ‘ఆంధ్రా అందగాడు’ అనే సినిమా తీసినప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో విమర్శలు ఎదురవడంతో కొంతకాలం బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత మాధవన్‌తో సినిమా తీసి సక్సెస్ బాట పట్టింది.

ఇక గతేడాది కొవిడ్ టైమ్‌లో సూర్య హీరోగా ఆమె తీసిన ‘ఆకాశం నీ హద్దు రా’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘పుతం పుదు కాదలై, పావ కథైగల్’ వంటి ఆంథాలజీలకు దర్శకత్వం వహించిన ఈ లేడీ డైరెక్టర్.. నెక్స్ట్ మూవీ ఎవరితో అనే విషయమై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం తను టాలీవుడ్ హీరోతో సినిమా తీయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కథ కూడా సిద్ధం చేసిన సుధ.. మళ్లీ హీరో వెంకటేశ్‌కే కథ వినిపించనుందా? లేదా టాలీవుడ్ యువహీరోలతో సినిమా చేస్తుందా? అనే విషయాలు తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed